November 19, 2019

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు – వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) – ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు అన్నీ రకాల వసతులు కల్పించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు రంగనాయకులపేటలోనున్న సెయింట్ జోసఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో 47వ సైన్స్ ఎగ్జిబిషన్ ను మంత్రి అనీల్ మంగళవారం ప్రారంభించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. పలు పాఠశాలల విద్యార్ధినీ విద్యార్ధులు ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. 1వ తరగతి నుండి పీజి వరకూ అన్నీ రకాల పుస్తకాలు లభించే సదుపాయం గల పెద్ద గ్రంధాలయాన్ని జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు నాడు – నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నారని, ప్రతీ పేదవాడు చదువుకోవాలని, చదువుకు పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశ్యంతో అమ్మఒడి పథకం ప్రవేశపెడుతన్నట్లు మంత్రి అనీల్ ప్రకటించారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం విద్యార్ధులకు శ్రీరామరక్ష లాంటిదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధనాచార్యులు, సర్వశిక్ష అభియాన్ ఏఓ బ్రహ్మనందరెడ్డి, డిప్యూటీ డిఈఓలు ఉష, విజయలక్షి పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!