November 19, 2019

పోలీసులకూ సంక్షేమ పథకాలు – పరిశీలిస్తున్నామన్న మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) – విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసే పోలీసులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే విషయంపై ప్రభుత్వం పరిశీలిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన పోలీసు మెగా ఉచిత వైద్య శిభిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రైం విభాగం అదనపు ఎస్పీ మనోహర్ రావు, నగర డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి, విజయా డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, నేతలు రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మూలాపేటలోని పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రసంగించారు. పోలీసు సంక్షేమంలో భాగంగా ఇప్పటికే వీక్లీ ఆఫ్ ను అమలుచేస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అందించే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. నెల్లూరునగరంలో సిసిటివి ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు సమకూర్చాలని నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!