November 19, 2019

కూలిన పెన్నా వారధి వంతెనను పరిశీలించిన మంత్రి అనీల్ – మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని పెన్నా వారధిపై ఉన్న పురాతన వంతెన మూడు రోజుల క్రితం కూలిపోయిన విషయం తెలిసిందే. నెల్లూరులో పర్యటిస్తున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ ఆదివారం ఉదయం పెన్నానది వద్దకు వెళ్లి కూలిన వంతెనను పరిశీలించారు. అలాగే పెన్నా బ్యారేజీ నుండి సోమశిల జలాలను పరిశీలించి ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు. బ్యారేజీ పనులు పూర్తయితే కూలిపోయిన వంతెన అవసరం ఉండకపోవచ్చునని అభిప్రాయపడుతూ అయినప్పటికీ మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వంతెన పై భాగం కూలి తూములు యధాతధంగా ఉన్న నేపద్యంలో మరమ్మత్తులు కూడా సులభంగా చేసే అవకాశం ఉందని అధికారులతో అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!