November 12, 2019

పవన్ సినిమా ఒప్పుకున్నాడు… జగన్ పాలన బాగున్నట్లే కదా… మంత్రి అనీల్ వ్యాఖ్య

Clock Of Nellore ( Nellore ) – జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ పింక్‌ అనే సినిమా రీమేక్‌ చిత్రంలో నటిస్తున్నారని కథనాలు వస్తున్నాయని, దీన్నిబట్టి చూస్తే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన బాగుందని ఆయన ఒప్పుకున్నట్లే అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. నెల్లూరు కోటమిట్టలో పర్యటించిన ఆయన నిన్న విశాఖలో నిర్వహించిన లాంగ్‌మార్చ్‌పై స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ తీరు సరిగా లేదని అన్నారు. వైయస్‌ జగన్‌ పాలన బాగుంటే సినిమాలు చేసుకుంటానన్న పవన్‌..ఇప్పుడు సినిమాకు ఒప్పుకున్నారని, దీన్ని బట్టి పవన్‌ పరోక్షంగా వైయస్‌ జగన్‌ పరిపాలన బాగుందని ఒప్పుకున్నట్లే గుర్తు చేశారు. ఇసుకపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!