November 22, 2019

నా జన్మ చరితార్ధం … రైతు భరోసా సభలో మంత్రి అనీల్ ఉద్వేగ ప్రసంగం

Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో మంగళవారం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రారంభోత్సవ సభలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ ఉద్వేగంగా ప్రసంగించారు. ఒక మనస్సున్న ముఖ్యమంత్రి ఉన్న కేబినెట్ లో మంత్రిగా తాను పనిచేయడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి నెల్లూరు జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరికీ మంత్రిగా అవకాశం కల్పించలేదని అంతటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వచ్చే 50 ఏళ్లలో కూడా బీసీలకు అవకాశాలు దక్కకపోవచ్చునన్నారు. భవిష్యత్తులో జిల్లాలో బీసీ మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది అనీల్ కుమార్ యాదవ్ అని చెప్పుకునే రోజు వస్తుందని అంతకంటే ఏం కావాలని వ్యాఖ్యానించారు. తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకూ జగన్ కు సైనికుడిగానే ఉంటానని అనీల్ స్పష్టం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!