November 19, 2019

చాలా సంతోషంగా ఉంది… సోమశిల పూర్తి స్థాయి నీటి మట్టంపై మంత్రి అనీల్ స్పందన

Clock Of Nellore ( Amaravathi ) – సోమశిల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 78 TMCలకు చేరడంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం 3గంటలకు సోమశిల 78 TMCలకు చేరుకుంది. అదే సమయంలో అమరావతిలో మంత్రి వర్గ సమావేశం ముగించుకుని బయటకు వచ్చిన అనీల్ దానిపై స్పందించారు. నెల్లూరుజిల్లా వాసిగా ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సోమశిల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పూర్తి స్థాయి నీటి మట్టం 78 TMCలకు చేరడం ఇదే ప్రధమం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో తాను ఇరిగేషన్ మంత్రిగా ఉన్న కాలంలో సమగ్ర సోమశిల కల సాకారం కావడం దేవ సంకల్పమేనని అభివర్ణించారు. రాష్ట్రంలోని 88 శాతం జలాశయాల్లో పుష్కలంగా నీరు ఉన్నాయని ఈ ఏడాది రైతాంగానికి పూర్తి స్థాయిలో నీరు ఇచ్చేందుకు ఆస్కారముందని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!