November 19, 2019

రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వానికి ఆదాయం – నెల్లూరులో వెల్లడించిన మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) – ఇరిగేషన్ పనుల్లో తాము చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వానికి 5వేల కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరులో కూలిన పెన్నా వారధి వంతెనను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తాము చేపట్టిన రివర్స్ టెండరిండ్ ద్వారా గత ప్రభుత్వ అవినీతి బట్టబయలైందని అన్నారు. రివర్స్ టెండరింగ్ విధానానికి వెళ్లి ఉండకపోతే 4 నుంచి 5వేల కోట్ల రూపాయల ప్రజా ధనం కాంట్రాక్టర్ల చేతిలోకి వెళ్లి ఉండేదని వివరించారు. రివర్స్ టెండరింగ్ లో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబు చేస్తోన్న వ్యాఖ్యలను ఖండించారు. గతంలో కాలువల మెయింటెనెన్స్ పనులను నామినేషన్ పద్దతిలోనే కేటాయించేవారని, అయితే జగన్ ప్రభుత్వంలో పారదర్శకంగా టెండర్లు పిలిచామని గుర్తు చేశారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 105 మెయింటెనెన్స్ పనులకు టెండర్లు పిలిచామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!