November 16, 2019

నెల్లూరు కార్పొరేషన్ అదనపు కమీషనర్ గా గోపి బాధ్యతల స్వీకరణ

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమీషనర్ గా మల్లాపు గోపి నియమితులైన విషయం తెలిసిందే. మెప్మాలో పనిచేస్తున్న గోపిని అదనపు కమీషనర్ గా నియమిస్తూ వారం రోజుల క్రితం పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపద్యంలో బుధవారం అదనపు కమీషనర్ గా నగరపాలక సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరియు కార్పొరేషన్ స్పెషలాఫీసర్ అయిన ఎమ్.వి. శేషగిరి బాబును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నెల్లూరు రూరల్ మండలం, చింతారెడ్డిపాళెం గ్రామానికి చెందిన మల్లాపు గోపి గ్రూప్ 1 పరీక్షల్లో 8వ ర్యాంకు సాధించారు. ఎమ్.పి.డి.ఓ గా తొలి పోస్టింగ్ పొందారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఎమ్.పి.డి.ఓ గా గోపి పనిచేశారు. తర్వాత మెప్మాకు బదిలీ అయ్యారు. తాజాగా నెల్లూరు నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ గా బదిలీపై వచ్చారు. నిజాయితీ గల అధికారిగా పేరు పొందిన మల్లాపు గోపి ఎమ్.పి.డి.ఓ గా పనిచేసే సమయంలో ఆయా మండలాల్లో పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజలకు చేరువయ్యారు. విధి నిర్వహణలో నిక్కచ్ఛిగా ఉంటారని పేరుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!