November 12, 2019

JNTU ఇంటర్ యూనివర్శిటీ క్రికెట్ టీం సెలక్షన్ కమిటి ఛైర్మైన్ గా మలిరెడ్డి కోటారెడ్డి నియామకం

Clock Of Nellore ( Nellore ) – జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ పరిధిలోని ఇంటర్ యూనివర్శిటీ బాలుర క్రికెట్ టీం సెలక్షన్ కమిటి ఛైర్మైన్ గా నెల్లూరుకు చెందిన మాజీ రంజీ క్రికెట్ క్రీడాకారులు, న్యాయవాది మరియు క్లాక్ ఆఫ్ నెల్లూరు జాతీయ పక్ష పత్రిక సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ మలిరెడ్డి కోటారెడ్డి నియమితులైనారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. JNTU బాలుర క్రికెట్ టీంకు కోటారెడ్డి ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ… క్రీడాకారులను ఎంపిక చేయనుంది. ఈనెల 21వ తేదీన గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఈ క్రీడాకారుల ఎంపిక జరగనుంది. JNTU పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల నుండి సుమారు 300 మంది క్రీడాకారులు ఈ సెలక్షన్స్ కు హాజరుకానున్నారు. వారిలో నుండి యూనివర్శిటీ క్రికెట్ టీంకు 16 మందిని ఎంపిక చేయనున్నారు. 2019 – 2020 సంవత్సరానికి గానూ ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!