November 21, 2019

గూడూరు వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పిన లారీ – వంతెనపై నుండి కాలువలోకి బోల్తా

Clock Of Nellore ( Gudur ) – నెల్లూరుజిల్లా గూడూరు సమీపంలో జాతీయ రహదారిపై ఓ లారీ వంతెనపై నుండి బోల్తా కొట్టి కాలువలో పడింది. తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఆ లారీ చెన్నై నుండి నెల్లూరు వైపు వస్తుండగా ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో రోడ్డు మధ్యలో ఉన్న వంతెన గోడను ఢీ కొట్టింది. వంతెన గోడ బీటలు వారడంతో వేగంతో ఉన్న లారీ ముందు నుండి కాలువలోకి ఒరిగి పోయింది. కాలువలో నీళ్లు ఎక్కువగా లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పంది. లారీ డ్రైవర్ రాజారెడ్డి, క్లీనర్ స్వల్పంగా గాయపడగా వారిని గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!