November 19, 2019

అయోధ్య తీర్పు – అనధికారికంగా మూసుకున్న బ్రాందీ షాపులు – మద్యం ప్రియుల తంటాలు …

Clock Of Nellore ( Nellore ) – అయోధ్య తీర్పు నేపద్యంలో నెల్లూరుజిల్లాలో మద్యం షాపులు మూత బడ్డాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా శనివారం మద్యం షాపులతో పాటూ బార్లను మూసివేయడంతో మద్యం ప్రియలు అవస్తలు పడ్డారు. సాధరణంగా మద్యం షాపులకు శెలవుల దినాలు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా లేకుండా మద్యం షాపులతో పాటూ బార్లను శనివారం ఉదయం నుండి మూసివేయడంతో మద్యం ప్రియులు షాపుల ముందు, బార్ల ముందు బార్లు తీరినా ఫలితం లేకపోవడంతో వెనుదిరిగారు. అయోధ్య కేసు తీర్పు నేపద్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎలాంటి అల్లర్లకు తావులేకుండా దేశం మొత్తం ఈ విధానాన్నే అవలంభిస్తుందని సమాచారం. మంచి నిర్ణయం. ఆదివారం కూడా మద్యం షాపులు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!