November 16, 2019

పెళ్లి వేడుకలో విషాదం – విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

Clock Of Nellore ( AS Pet ) – ఆనందంగా జరుగుతున్న వివాహ వేడుకల్లో విషాదం నెలకొంది. అప్పటి వరకూ అక్కడే చలాకీగా తిరుగుతూ కనిపించిన ఆ యువకుడు క్షణాల వ్యవధిలో శవమై కనిపించాడు. ఈ హృదయ విదారకమైన ఘటన నెల్లూరుజిల్లా ఏఎస్ పేట మండలంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు పట్టణానికి చెందిన కేశవులు శుభకార్యాలకు లైటింగ్ వేసే పనిచేసేవాడు. యధామాదిరిగానే ఏఎస్ పేట మండలం, చౌట భీమవరం గ్రామంలో ఓ వివాహ వేడుకలో లైటింగ్ ఒప్పుకోగా అక్కడికెళ్లి లైటింగ్ వైశాడు. సోమవారం ఉదయం వర్షానికి అక్కడక్కడా లైట్లు చెదిరిపోగా వాటిని సరిచేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. విద్యుత్ షాక్ కు తోడు వర్షానికి నేలంతా తడిగా ఉండటంతో షాక్ ఎక్కువ తీవ్రత తగిలింది. దీంతో కేశవులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న ఏఎస్ పేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కేశవులుకు భార్య, చిన్న బాలుడు ఉన్నాడు. ప్రభుత్వం ఆర్ధిక సాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు వేడుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!