November 16, 2019

ఎమ్మెల్యే కాకాణి పేరుతో ఎమ్పీడిఓ డబ్బులు డిమాండ్ చేశారు – ఆరోపించిన లే అవుట్ యజమాని

Clock Of Nellore ( Venkatachalam ) – లే అవుట్ కు వాటర్ పైప్ లైన్ అనుమతి కోసం వెంకటాచలం ఎమ్పీడిఓ సరళ స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో తమను నగదు డిమాండ్ చేశారని లే అవుట్ యజమాని కృష్ణారెడ్డి, వైసిపి అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. లే అవుట్ కు సంభందించిన వివాదంలో ఎమ్పీడిఓ ఫిర్యాదుతో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇచ్చేందుకు లే అవుట్ యజమాని కృష్ణారెడ్డి, వైసీపి నేత శ్రీకాంత్ రెడ్డి గొలగమూడిలోని లే అవుట్ లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. లే అవుట్ కు వాటర్ పైప్ లైన్ కోసం గత మూడు నెలల నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నానని కృష్ణారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో అనుమతి కోసం డబ్బులు అడిగారన్నారు. దీంతో తనకు బంధువైన శ్రీకాంత్ రెడ్డికి చెప్పానన్నారు. శ్రీకాంత్ రెడ్డికి అదే మాట చెప్పినట్లు వివరించారు. లే అవుట్ విషయంలో ఎక్కడా ఉల్లంఘనలు లేవని పూర్తి స్థాయి అనుమతులతోనే లే అవుట్ ను వేశామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి కేవలం ఎమ్పీడిఓతో ఫోన్ లోనే మాట్లాడారన్నారు. ఇంటికెళ్లి దౌర్జన్యం చేశారన్నది అబద్ధమన్నారు. ఉద్ధేశ్య పూర్వకంగా కోటంరెడ్డిపై తప్పుడు ఫిర్యాదు చేశారని వారు వెల్లడించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!