November 19, 2019

నెల్లూరులో లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్ కుమార్ – ఆనం కార్యాలయంలో పిచ్చాపాటి

Clock Of Nellore ( Nellore ) – డబ్బులు… ఊరికే రావు… అంటూ వాణిజ్య ప్రకటనల్లో అందర్నీ ఆకర్షంచే లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్ కుమార్… స్వస్థలం నెల్లూరులో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం నెల్లూరుకు చేరుకున్న కిరణ్ కుమార్ మండపాల వీధిలోని వారి స్వగృహంలో బసచేశారు. రాత్రి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. సోమవారం కూడా నెల్లూరులోనే గడిపారు. బంధువులు, స్నేహితులతో కలిసి నెల్లూరు వీధుల్లో తిరుగుతూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆయనకు అత్యంత ఇష్టమైన మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి కార్యాలయానికి వెళ్లి కాసేపు కూర్చున్నారు. వివేకానందరెడ్డి కుమారులు, మాజీ కార్పొరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డితో కాసేపు మాట్లాడారు. వివేకానందరెడ్డితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీకి రాజైనా… అమ్మకు కొడుకే అన్న సామెతలా తాను ఎక్కడున్నా స్వస్థలం నెల్లూరంటే అభిమానమని తన మనసులో మాటను స్నేహితులతో పంచుకున్నారు. పలువురు ఆయన్ను కలిసి సెల్ఫీలు దిగారు. ఎప్పుడూ టీవిల్లో కనిపించే కిరణ్ కుమార్ ఒక్కసారిగా రోడ్డుపై కనిపించడంతో ఆయన్ను చూసేందుకు జనం పోటీ పడ్డారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!