November 19, 2019

బ్యాంక్ మేనేజర్ వేధింపులు – ఆత్మకూరులో మహిళ ఆత్మహత్యాయత్నం

Clock Of Nellore ( Atmakur ) – బ్యాంకు రుణం పూర్తిగా చెల్లించినా ఇంకా కట్టాలని బలవంతం చేస్తున్న మేనేజర్ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మకూరు ఏసిఎస్ కాలనీకి చెందిన శైలజ అనే పొదుపు మహిళ స్థానిక పినాకిని గ్రామీణ బ్యాంకులో పొదుపు సంఘాల ద్వారా రుణం తీసుకుని ఉంది. గతంలో అనేక సార్లు రుణాలను తిరిగి చెల్లించి మళ్లీ రుణాలు తీసుకునే వారు. ఈ క్రమంలో ఒకటిన్నర సంవత్సరం క్రితం తీసుకున్న రుణాన్ని కూడా పూర్తిగా చెల్లించినట్లు శైలజ చెబుతుంది. మళ్లీ రుణానికి ధరఖాస్తు చేసుకుంటే పాత రుణం ఇంకా ఉందంటూ మేనేజర్ చెప్పగా మళ్లీ నగదు చెల్లించింది. అయినప్పటికీ ఇంకా చెల్లించాలని మేనేజర్ ఒత్తిడి తీసుకొచ్చారు. పూర్తిగా చెల్లించానని చెప్పినే మేనేజర్ వినిపించుకోలేదు. దీంతో శైలజ 10 రోజుల క్రితం దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. కలెక్టర్ ఆదేశాలతో స్థానిక పోలీసులు మేనేజర్ తో చర్చలు జరిపినా ఆయన తీరుమారలేదని తెలిసింది. మనేజర్ అప్పుకట్టాలని వేధిస్తుండటం, ఉన్నతాధికారులను కలిసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో శైలజ ఆదివారం ఉదయం ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసింది. మేనేజర్ వేధింపులు భరించలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు శైలజ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ శైలజను ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!