November 19, 2019

నెల్లూరులో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య – సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – సాటి మహిళలకు ధైర్యం చెప్పాల్సిన పోలీస్ కానిస్టేబుల్ భర్త వేధింపులకు బలైంది. ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. నెల్లూరు నగరం కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలో మహిళా కానిస్టేబుల్ నాగలక్ష్మి సోమవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. జిల్లా పోలీస్ ఆఫీస్ లో కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది నాగలక్ష్మి. భర్త నిత్యం ఈమెను వేధిస్తుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఈరోజు నాగలక్ష్మి ఉరేసుకుని చనిపోయింది. నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, దర్గామిట్ట సిఐ నాగశ్వరమ్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించి సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే సూసైడ్ నోట్ లో ఏముందో పోలీసులు వెల్లడించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!