November 16, 2019

ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసిన కోవూరు పోలీసులు – ఇద్దరూ పాత నేరస్తులే

Clock Of Nellore ( Kovur ) – ఒకరేమో… కన్న కూతురిపైనే అత్యాచారం చేసిన దుర్మార్గుడు… ఇంకొకడు… దొంగతనాలు చేస్తూ జైలుకెళ్లిన ఘనుడు… ఇద్దరూ కలిసి పలు నేరాలకు పాల్పడ్డారు. తాజాగా నెల్లూరులోని కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడి మరో సారి పోలీసులకు పట్టుబడ్డారు. సంగం మండలం, జెండా దిబ్బకు చెందిన రాచపూడి మస్తానయ్య, రాచపూడి వెంకట నారాయణ ఇద్దరూ గతంలో పలు దొంగతనాలు చేసి జైలుకు పోయి వచ్చి ఉన్నారు. తాజాగా గత నెల 30వ తేదీనా కోవూరుకు చెందిన మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలోని రెండు బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన కోవూరు పోలీసులు గురువారం ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి చోరీ అయిన గొలుసులకు రికవరీ చేశారు. నెల్లూరు రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కోవూరు సిఐ శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!