November 22, 2019

టిటిడి బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఎమ్మెల్యే నల్లపరెడ్డి శుభాకాంక్షలు

Clock Of Nellore ( Nellore ) – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా నియమితులై, శనివారం ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకున్న నెల్లూరుకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఆదివారం నెల్లూరులోని వారి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందజేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సేవ చేసే భాగ్యం లభించడం ఎంతో అదృష్ఠమని ఆమెతో అన్నారు. తిరుమల క్షేత్ర వైభవాన్ని నలు దిశలా చాటేలా పనిచేయాలని అలాగే సామాన్యులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆమెకు పలు సూచనలు చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!