January 23, 2020

డాక్టరేట్ ను అందుకున్న కోట సునీల్ కుమార్

Clock Of Nellore ( Goa ) – నెల్లూరుజిల్లా గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ టాక్స్ కన్సెల్టెంట్ మరియు ఆథ్యాత్మిక వేత్త కోట సునీల్ కుమార్ గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. ఆయన చేస్తున్న సామాజిక సేవలను గుర్తించిన గోవాలోని ఇండియన్ వర్చువల్ అకాడమీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ డాక్టరేట్ కు ఎంపిక చేసింది. గోవాలోని పనాజీలో శనివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో భాగంగా కోట సునీల్ కుమార్ కు ఆ సంస్థ ప్రతినిధులు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి డాక్టరేట్ ను అందుకున్న సునీల్ కుమార్ ఇచ్చిన గౌరవాన్ని వమ్ముచేయనని అన్నారు. గూడూరులో ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన సునీల్ కుమార్ తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా టాక్స్ కన్సల్టెంట్ గా కొనసాగుతున్నారు. సాయిబాబా పై ఉన్న భక్తితో గూడూరు పట్టణంలో శ్రీ సాయి సత్సంగ నిలయాన్ని స్థాపించి నిత్యం పూజలు, బాబా బోధనలు చేస్తుండేవారు. అలాగే అదే మందిరంలో శ్రీ విజయదుర్గా అమ్మవారి విగ్రహాన్ని స్థాపించి నిత్యపూజలు చేసేవారు. ప్రతీ ఏడాది దసరా పండుగలో అమ్మవారి శరన్నవ రాత్రి మహోత్సవాలు నిర్వహిస్తుంటారు. చివరి రోజు అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అంతే కాకుండా లోక కళ్యాణం కోసం నెల్లూరుజిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా మహా నవావరణ హోమాలను నిర్వహిస్తున్నారు. హింధూ ధర్మ పరిరక్షణ ట్రస్టు నెల్లూరు జిల్లా కో – ఆర్డినేటర్ గా పనిచేసిన సునీల్ కుమార్ జిల్లాలో హింధూ ధర్మ స్థాపనకు ఎంతో కృషి చేశారు. వీటితో పాటూ సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించే కోట సునీల్ కుమార్ కేరళ, వైజాగ్, నెల్లూరులో సంభవించిన తుఫాన్లు, వరద సమయంలో తన వంతుగా బాధితులకు సహాయం అందించారు. నిరుపేదలకు సహాయకారిగా ఉంటుంటారు. ఆయన డాక్టరేట్ అందుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!