December 16, 2019

మహిషాసురుడు… రాజ్య ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన చక్రవర్తి – ఇది అసలు చరిత్ర

Clock Of Nellore ( Central Desk ) – మహిషాసురుడు, రావణాసురుడు, నరకాసురుడు, వీళ్లు రాక్షసులు కారు … వీరంతో మన దేశ మూలవాసుల రారాజులు… ప్రజా సంక్షేమం కోసం పోరాడిన చక్రవర్తులు, ద్రవిడ రాజులు… ఆర్యుల కుట్రలకు బలైన వీరాధివీరులు… ఇదేంటీ ఇలా అంటున్నారు… అనుకుంటున్నారా… అవును ఇది చరిద్ర చెబుతున్న పచ్చి నిజం… మేధావులు, చరిత్ర పరిశోధకులు, దళిత సంఘాల నాయకులు ఇదే నిజమంటున్నారు. ఆర్యులు… కుట్రలో భాగంగానే వీరిని వధించారని అంటున్నారు. ప్రజలు నిజం తెలుసుకోవాలని… మన దేశ రాజులనే చంపి… మన చేతే పండుగ చేయిస్తున్నారని అంటున్నారు. చరిత్రను మార్చాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇంతకీ ఏది నిజమో తెలుసుకుందాం.

రావణాసురుడు – 10 శిరస్సుల జ్ఞానం కలిగిన రాజు …. మహిషాసురుడు – రాజ్య ప్రజల సంక్షేమం కోసం బలైన ద్రవిడ నాయకుడు …. నరకాసురుడు – అత్యంత బలశాలి అయిన దళిత చక్రవర్తి… అందుకే వీరికి దళిత వర్గాల వారు నీరాజనం పలుకుతున్నారు. వారు చనిపోయిన రోజున వర్ధంతులను నిర్వహిస్తున్నారు. రాజ్యాలను ఏలిన ఇంత మంచి చక్రవర్తులను ఆర్యులెందుకు వధించారు… దీపావళి రోజుల వారి బొమ్మలను ఎందుకు కాలుస్తున్నారు… మహిషాసురుడు చనిపోయాడని ఎందుకు దసరా పండుగ జరుపుకుంటున్నారు… ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొందరు దళిత వర్గాల మేధావులు దీనిపై చర్చకు సవాలు విసురుతున్నారు. ఆర్యులు మన ప్రాంత రారాజులపై కుట్ర పన్ని పథకం ప్రకారమే వధించారని వీరు చెబుతున్నారు.

ప్రాచీన కాలంలో మన భూభాగం దేశాలుగా ఉండేది కాదు. కేవలం ప్రాంతాలుగా మాత్రమే ఉండేది. ఎక్కడ ప్రజలు నివసిస్తుంటే అదొక రాజ్యంగా వర్ధిల్లేది. అప్పట్లో మన ప్రాంతాలను పాలించిన రాజులే రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు… ఇకపోతే ఆర్య రాజులు…. ఆర్యులంటే మన భూ భాగానికి సుదూర దూరంలో ఉండే వారు. ప్రస్తుత వాడుక బాషలో చెప్పాలంటే, విదేశీయులు. ఆర్యులు ప్రపంచానికి నాగరికత నేర్పారని ప్రచారం. మన భూభాగాన్ని పాలించాలన్న ఆకాంక్షతో ఆర్యులు ఇక్కడికి ప్రవేశించారని, స్థానిక రాజులైన రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడిపై ఓ పథకం ప్రకారం కుట్రపన్ని చెడుగా ప్రచారం చేసి రాక్షసులుగా వారిపై ముద్ర వేశారని మేధావుల ఆరోపణ. ఆర్యులు యజ్ఞ యాగాదుల కోసం అడవులను హరించడం, జంతువులను వధించడం చేయడాన్ని రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు తీవ్రంగా వ్యతిరేకించారని మేధావులు అంటారు. ఇందులో భాగంగా ఆర్యులపై వీరు జరిపిన పోరాటాల్లో లేనిపోనిని సృష్ఠించారని, వీరు మహిళలను అవమానపర్చారని చెడుగ9ా ప్రచారం చేసి, వారిని చంపి కట్టు కథలన్నీ అల్లారని అంటున్నారు. మహిషాసురుడు, నరకాసురుడు, రావణాసురుడ్ని చంపిన కృష్ణుడు, రాముడు మరికొందరంతా విదేశీయులైన ఆర్యులని, మన భూభాగంలో ఆధిపత్యాన్ని చెలాయించేందుకు స్థానిక రాజులుగా ఉన్న వారిని అన్యాయంగా, అధర్మంగా, కుట్రపూరితంగా హత్య చేశారని, ఇదంతా బ్రాహ్మణ వాద కుట్రలో భాగమని అంటున్నారు. నిజాన్ని నేటి తరం తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!