January 23, 2020

చిన్నారి జ్ఞాపకార్థం – విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్​ నియోజకవర్గ పరిధిలోని, ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న దోరడ్ల హిమసాగర్​, మాధవిలత తొలి సంతానమైన చిన్నారి చిన్మయి ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచి, ఏడాది పూర్తయిన సందర్భంగా, ఆ చిన్నారి జ్ఞాపకార్థం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 100 మంది నిరుపేద విద్యార్థులకు ప్యాడ్​లు, పెన్​లు, నోట్​ బుక్స్​తోపాటూ పెన్సిళ్లు, స్కేళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు హిమ సాగర్​ మాట్లాడుతూ తన కుమార్తె చిన్మయి లోకాన్ని విడిచి వెళ్లి ఏడాది పూర్తయిందని, ఆ చిన్నారి జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించామని అన్నారు. అందులో భాగంగా తొలి వర్థంతి సందర్భంగా, పేద విద్యార్థులకు నోట్​బుక్స్​ , ప్యాడ్​లు, పెన్​లు అందించినట్లు తెలిపారు. ప్రతి ఏటా ఇదే తరహాలో పేదలను ఆదుకునే విధంగా సేవ కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దోరడ్ల వెంకట నారాయణ, వేదకుమారి, స్కూల్​ అధ్యాపకులు, కళ్యాణ్​, రోజా, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!