January 23, 2020

వైసీపిలో చేరిన యువనేత ముసుమూరు వినోద్ కుమార్ – ఆహ్వానించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – సమైఖ్యాంధ్ర ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ గా ఉంటూ, సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ శిష్యునిగా కొనసాగుతున్న నెల్లూరుకు చెందిన ముసునూరు వినోద్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం నెల్లూరు రూరల్ వైసీపి కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో అనుచరులతో కలిసి వైసీపి తీర్ధం పుచ్చుకున్నారు. అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. వినోద్ కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా, యువత పరంగా అందరికీ సత్సంభందాలు ఉన్న వినోద్ కుమార్ వైసీపిలో చేరడం సంతోషకరమన్నారు. వైసీపి యువతను ప్రోత్సహిస్తుందని వినోద్ కుమార్ కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమైఖ్యాంద్ర ఉద్యమంలో వినోద్ కుమార్ చురుగ్గా పనిచేశారని అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని అప్పుడే తాను ఊహించానని అంటూ అది వైసీపి ద్వారా రావడం ఇంకా ఆనందకరమని వ్యాఖ్యానించారు. తనను నమ్మి, తన వెంట వస్తున్న కార్యకర్తలకూ ఎప్పుడూ అండగా ఉంటానని, ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాల పట్ల అనేక మంది ఆకర్షితులయ్యి పార్టీలో చేరుతున్నారని కోటంరెడ్డి అన్నారు. ఈనెల ఆఖరు నుండి జనవరి ఆఖరు వరకూ రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని, వివిధ పార్టీలకు చెందిన వారే కాకుండా తటస్తులు సైతం వైసీపిలో చేరుతున్నారని చెప్పారు. తదుపరి వినోద్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి నియోజకవర్గ అభివృద్ది ఎనలేని కృషి చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యకర్తలపై చూపే అభిమానం, చేస్తున్న అభివృద్ది తనను వైసీపిలోకి వచ్చేలా చేసిందన్నారు. కోటంరెడ్డితో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు, నేతలు మురళీకృష్ణాయాదవ్, 19వ డివిజన్ వైసీపి ఇంఛార్జ్ పచ్చా రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!