November 21, 2019

ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నీరు గార్చవద్దు – ప్రభుత్వాన్ని కోరిక పవన్ కళ్యాణ్

Clock Of Nellore ( Amaravathi ) – వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి కేసును నీరుగార్చవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూపించారు. సోమవారం ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. మహిళా ఉద్యోగులపై దాడులకు తెగపడుతుంటే సగటు మహిళలకు భద్రత ఎక్కడుందని ప్రశ్నించారు. ఎంపీడీవో సరళ పై దాడిని వైకాపా ఎందుకు ఖండించడం లేదని కోటంరెడ్డి పై తీవ్రమైన చర్యలకు ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు. శ్రీధర్ రెడ్డిపై బెయిల్ సులువుగా ఇచ్చే 448, 427, 506, 290 సెక్షన్లతో కేసులు నమోదు చేశారన్న జనసేనాని, కేసును నిర్వీర్యం చేయడం ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు అని ప్రశ్నించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై కఠినమైన చర్యలు తీసుకోవాలన్న పవన్ కళ్యాణ్… సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కే ప్రతిపక్ష పార్టీల నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం సరికాదని ఆక్షేపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!