November 22, 2019

నెల్లూరులో యాంకర్ రష్మీ సందడి – కిర్రాక్ ఆర్పీ ఈవెంట్స్ ప్రారంభం

Clock Of Nellore ( Nellore ) – జబర్ధస్త్ కామెడీ షో నటుడు, నెల్లూరు వాసి కిర్రాక్ ఆర్పీ సొంత గడ్డపై ఈవెంట్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అన్నీ శుభకార్యాలకు సంభందించిన ఈవెంట్ మేనేజ్ మెంట్ కార్యాలయాన్ని నగరంలోని బొల్లినేని హాస్పిటల్ ఎదురుగా ఉన్న భవనంలో ఏర్పాటు చేశారు. కార్యాలయ ప్రారంభోత్సం ఆదివారం ఘనంగా జరిగింది. జబర్ధస్త్ యాంకర్ రష్మీ ముఖ్య అతిధిగా హాజరయ్యి ఆర్పీ ఈవెంట్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ ఆర్పీకి జన్మస్థలం నెల్లూరంటే ఎంతో మక్కువని అన్నారు. ఆ మక్కువతోనే ఈవెంట్స్ ను ప్రారంభించారని చెప్పారు. కిర్రాక్ ఆర్పీ మాట్లాడుతూ మామూలుగా అయితే ట్రస్ట్ పెట్టాలని అనుకున్నానని, అయితే అనేక మంది శుభ కార్యాలు సరిగా నిర్వహించలేక ఇబ్బందులు పడుతుండటాన్ని తాను గమనించానని వివరించారు. అతి తక్కువ ఖర్చుతోనే అన్నీ కార్యక్రమాల నిర్వహణను తమ ఈవెంట్స్ నిర్వహిస్తుందని వివరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!