January 23, 2020

నెల్లూరు నగర డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులురెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర డిఎస్పీగా జె. శ్రీనివాసులురెడ్డి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా నగర డిఎస్పీగా ఉన్న ఎన్.బి.ఎమ్. మురళీకృష్ణను పోలీసు ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో డిఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాసులురెడ్డిని నెల్లూరు నగర డిఎస్పీగా నియమించారు. ఇందులో భాగంగా డిఎస్పీ సోమవారం ఉదయం నెల్లూరుకు చేరుకుని దర్గామిట్టలోనున్న ఆయన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలానికి చెందిన శ్రీనివాసులురెడ్డి 1989వ సంవత్సరంలో ఎస్సైగా ఉద్యోగం పొంది కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో పనిచేసి 2001లో సిఐగా పదోన్నతి పొందారు. మైదుకూరు, ప్రొద్దుటూరులో సిఐగా పనిచేసి, తిరుపతి ఏసిబి సిఐగా పనిచేస్తూ 2011లో డిఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రొద్దుటూరు, ఆదోని, అనంతపురం ఇంటెలిజెన్స్, అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో పనిచేస్తూ నెల్లూరు నగర డిఎస్పీగా బదిలీపై వచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!