November 16, 2019

ఈనెల 27న పిఎస్ఎల్వీ – సి47 రాకెట్ ప్రయోగం – వచ్చే నెలలో మరో ప్రయోగానికి సన్నద్ధం

Clock Of Nellore ( SrihariKota ) – ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ – 2 వైఫల్యం తర్వాత మరో ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) సన్నద్ధమైంది. వైఫల్యాలను అధిగమించి విజయాల వైపు దూసుకెళ్లే దిశగా శాస్త్రవేత్తలు అడుగులు ముందుకేస్తున్నారు. ఈనెల 27వ తేదీనా పిఎస్ఎల్వీ – సి47 రాకెట్ ను ప్రయోగించేందుకు ఇస్రో సిద్దమైంది. దీనికి సంభందించిన నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ లో పిఎస్ఎల్వీ – సి47 రాకెట్ అనుసంధాన పనులు గురువారంతో పూర్తయ్యాయి. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. రాకెట్ కు తుది పరీక్షలు నిర్వహించి మరో 10 రోజుల్లో మొదటి ప్రయోగ వేదికపైకి చేర్చనున్నారు. తర్వాత రాకెట్ సన్నాహక సన్నద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగానికి పచ్చ జెండా ఊపనున్నారు. మరో వైపు ఈ ప్రయోగం పూర్తయిన వెంటనే డిసెంబర్ లో పిఎస్ఎల్వీ – సి48 రాకెట్ ను ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నారు. పిఎస్ఎల్వీ – సి48 ద్వారా స్వదేశీ ఉపగ్రహంతో పాటూ విదేశీ ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపనున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!