November 16, 2019

అద్భుతం… సుందర దృశ్యం… సోమశిల జలాశయం అన్నీ గేట్లు తెరిచిన అధికారులు

Clock Of Nellore ( Somasila ) – నెల్లూరుజిల్లాలోని సోమశిల జలాశయం వద్ద సుందర దృశ్యం ఆవిష్క్రృతమైంది. జలాశయంలో ఉన్న మొత్తం 12 గేట్లను అధికారులు గురువారం ఉదయం తెరవడంతో సోమశిల జలాలు పెన్నానదిలోకి జాలువారుతూ… గలగల శబ్ధంతో చూపరులను మైమరపిస్తుంది. సోమశిల పూర్తి సామర్ధ్యం 78 TMCలకు జలాశయం బుధవారం సాయంత్రం చేరుకుంది. ఇప్పటికే కండలేరు జలాశయంతో పాటూ ఉత్తర, దక్షిణ కాలువల గుండా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఇన్ ఫ్లో కొనసాగుతుండటంతో బుధవారం ఉదయం రెండు గేట్లు, మధ్యాహ్నం తర్వాత మరో రెండు గేట్లను తెరచి పెన్నాలోని నీటిని విడుదల చేశారు. గురువారం ఉదయం సోమశిల చీఫ్ ఇంజనీర్ మురళీనాథ్ రెడ్డి పూజ చేసి మొత్తం 12 గేట్లను తెరిచారు. ఈ 12గేట్ల ద్వారా పెన్నాకు 40వేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. గేట్లు తెరిచిన అనంతరం చీఫ్ ఇంజనీర్ మురళీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జలాశయంలో 78 TMCల నీటి నిల్వను కొనసాగిస్తున్న… ఇన్ ఫ్లో ద్వారా వస్తున్న జలాలను అదే స్థాయిలో అవుట్ ఫ్లో ద్వారా బయటకు పంపిస్తామని చెప్పారు. జలాలు పుష్కలంగా ఉన్న నేపద్యంలో జిల్లాలోని ప్రతీ ఎకరాకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. తమిళనాడుకు 2 TMCల నీటిని ఇప్పటికే పంపామని, మరో 2 TMCల నీటిని పంపాల్సి ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!