January 23, 2020

మంచినీటి సమస్యపై మంత్రి మేకపాటి సమీక్ష – గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపిస్తామని వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, రావల్సినంత వర్షం రాకపోవడమే దానికి కారణమని రాష్ట్ర ఐటి మరియు వరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పలు సమస్యలను మంత్రి దృష్ఠికి తీసుకెళ్లారు. ప్రధానంగా నీటి సమస్య, రైతులకు విత్తనాలు అంశాలపై చర్చ జరిగింది. సమీక్ష అనంతరం మంత్రి మేకపాటి మాట్లాడుతూ జిల్లాలో నీటి సమస్య పరిష్కారానికి 15 రోజుల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామన్నారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లాలో అనేక చోట్ల బోరు బావులు ఉన్నాయని తక్షణం వాటిని గుర్తించి మూసివేయించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో వివిధ పథకాల్లో అంతులేని అవినీతి జరిగిందని దానిపై రాష్ట్ర స్థాయిలో విచారణ చేయిస్తామని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!