November 12, 2019

ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు కంప్యూటర్ పాఠాలు – అక్షరలో ఉపరాష్ట్రపతి సతీమణి ప్రారంభం

Clock Of Nellore ( VenkataChalam ) – ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడమే ప్రధానంశంగా కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేసినట్లు భారత ఉపరాష్ట్రపతి ఎమ్. వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ తెలిపారు. నెల్లూరుజిల్లా, వెంకటాచలం మండలంలోని అక్షర విద్యాలయంలో 25లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను బుధవారం వెంకయ్య నాయుడు సతీమణి ఉప ప్రారంభించారు. అనంతరం వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ మాట్లాడుతూ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అతుల్ నిషా ఫౌండేషన్ సహకారంతో కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నెల్లూరులోని 4 కేంద్రాలలో నడుస్తున్న అక్షర విద్యాలయ విద్యార్ధినీ, విద్యార్ధులకు సైన్స్, గణితంలో నైపుణ్యం పెంపొందించుకునేందుకు కంప్యూటర్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. మొదటగా వెంకటాచలం ప్రభుత్వ పాఠశాల విద్యార్ధినీ, విద్యార్ధులకు ఆ తరువాత నెల్లూరులోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు కంప్యూటర్ లో ప్రావీణ్యం కల్పిస్తామని దీపా వెంకట్ వెల్లడించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!