November 22, 2019

నిండు కుండను తలపిస్తున్న సోమశిల – 65 TMCలకు పైగా చేరిన నీటి మట్టం

Clock Of Nellore ( Somasila ) – కడప, కర్నూలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో నెల్లూరుజిల్లాలోని సోమశిల జలాశయం నిండు కుండను తలపిస్తుంది. గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా సోమశిల పూర్తి స్థాయి నీటి మట్టంతో కళకళలాడుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు వచ్చిన నివేదిక ప్రకారం సోమశిలలో 65.665 TMCల నీటి మట్టం నమోదైంది. ఇన్ ఫ్లో 44700 క్యూసెక్కులగా కొనసాగుతుండగా, అవుట్ ఫ్లో 20950 క్యూసెక్కులుగా ఉంది. ఆదివారం ఉదయం వరకూ జలాశయంకు ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కుల వరకూ ఉండగా దాని ఆధారంగా సోమవారం తెల్లవారు జామున ప్రాజెక్టు గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే సాయంత్రానికల్లా ఇన్ ఫ్లో తగ్గడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. జలాశయంలో 75 TMC ల నీటి నిల్వ చేయాలని నిర్ణయించారు. ఇన్ ఫ్లో ఇదే మాదిరిగా కొనసాగితే సోమవారం సాయంత్రం క్రస్ట్ గేట్లు ఎత్తనున్నారు. మరో వైపు జిల్లా అధికారులు, పోలీసులు పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!