November 19, 2019

రేపు నెల్లూరుకు రానున్న ఇంఛార్జ్ మంత్రి బాలినేని – వ్యవసాయంపై అధికారులతో సమీక్ష

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం నెల్లూరులో పర్యటించనున్నారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు, సీజనల్ వ్యాధులు మరియు వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న చర్యలు, అటవీ సమస్యలు, నీటి పారుదల, అన్నీ ఇంజనీరింగ్ శాఖలు చేపట్టిన పనులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుండి జరిగే ఈ సమీక్షలో జిల్లా మంత్రులు డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరుకానున్నారు. ఇంఛార్జ్ మంత్రిగా నియమితులైన తర్వాత బాలినేని తొలిసారిగా జిల్లాకు రావడం ఇదే ప్రధమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!