November 22, 2019

నెల్లూరుజిల్లా సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ – జిల్లా సమీక్షలో ఇంఛార్జ్ మంత్రి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారని, జిల్లాను అన్నీ విధాలా అభివృద్ధి చేసేందుకు ఆయన సిద్దంగా ఉన్నారని జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా కమిటి సమావేశం జరిగింది. కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇంఛార్జ్ మంత్రి బాలినేనితో పాటూ జిల్లా మంత్రులు డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, జిల్లాలోని శాసనసభ్యులు, అన్నీ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంఛార్జ్ మంత్రి బాలినేని మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న అటవీ సంబంధ సమస్యలన్నీ పరిష్కరించేందుకు తగు చర్యలు చేపడతానని చెప్పారు. రాజకీయంగా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్న నెల్లూరుజిల్లాకు ఇంఛార్జ్ మంత్రిగా రావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలందరితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బాలినేని గుర్తు చేశారు. జిల్లాకు సంబంధించిన పనులన్నీ చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, ప్రతీ నెలా సమీక్షా సమావేశం నిర్వహించాలని తనను సిఎం ఆదేశించారని పేర్కొన్నారు. నవ రత్నాల పథకాలను క్రమం తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు కోరిన పనులపై కలెక్టర్ తో పాటూ ఎస్పీ సానుకూలంగా స్పందించాలని కోరారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే తగు చర్యలు చేపట్టాలని మంత్రి బాలినేని పలు సూచనలు చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!