November 19, 2019

నెల్లూరులో వ్రాంగ్న్ మరియు ఇమారా షోరూం ప్రారంభోత్సవంలో ఆకట్టుకున్న ఫ్యాషన్ షో

Clock Of Nellore ( Nellore ) – పురుషులు ధరించే ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్ వ్రాంగ్న్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో తొలి ఔట్ లెట్ ను ప్రారంభించింది. మొట్టమొదటి ఔట్ లెట్ ను నెల్లూరులోని ఎంజీబి ఫెలిసిటీ మాల్ లో ఏర్పాటు చేయగా అది శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. యూనివర్శల్ స్పోర్ట్స్ బిజ్ ( USPL ) ఆధ్వర్యంలో కొనసాగే ఈ వ్రాగ్న్ దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యవహరిస్తున్నారు. ఇది దేశంలోనే 26వ ఔట్ లెట్. టీ షర్టులు, చొక్కాలు, చినోలు, స్లిమ్ ఫిట్ ట్రౌజర్లు, క్యాజువల్ జాకెట్లు, క్యాజువల్ అండ్ సెమీ ఫార్మల్ మరియు వివిధ సందర్భాల్లో ధరించే 250కి పైగా డిజైన్లు వ్రాంగ్న్ ఔట్ లెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ కలెక్షన్ 799 రూపాయల నుండి మొదలవుతుంది. ఈ ప్రారంభోత్సవం సందర్బంగా USPL సీఈఓ, వ్యవస్థాపకురాలు అంజనారెడ్డి మాట్లాడుతూ యువత ఆఫ్ బీట్ ఫ్యాషన్లు, డిజైన్లతో సందడి చేయడమే తమ వ్రాంగ్న్ బ్రాండ్ లక్ష్యమని అన్నారు. నెల్లూరు నగరం ఎప్పుడూ నూతనత్వాన్ని ప్రోత్సహిస్తుందని రానున్న మూడేళ్లలో దేశ వ్యాప్తంగా 20 ప్రత్యేక స్టోర్లు ప్రారంభించాలన్నదే తమ లక్ష్యమన్నారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఫ్యాషన్ లో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తున్నామని అంజనా రెడ్డి స్పష్టం చేశారు.

ఘనంగా ఇమారా ప్రారంభోత్సవం
యూనివర్శల్ స్పోర్ట్స్ బిజ్ ( USPL ) ఆధ్వర్యంలో కొనసాగే మరో ఔట్ లెట్ కూడా ఎంజీబి ఫెలిసిటీ మాల్ లో శుక్రవారం ప్రారంభమైంది. మహిళల సంప్రదాయ దుస్తుల బ్రాండ్ ఇమారా ఔట్ లెట్ కూడా ఏర్పాటైంది. భారత దేశ వ్యాప్తంగా మహిళల సాంప్రదాయ దుస్తుల తయారీ బ్రాండ్ సంస్థగా ఇమారా కొనసాగుతుంది. నెల్లూరులో ఈ ఔట్ లెట్ మొదటిది కాగా భారతదేశంలో ఇది 17వది. 300 కి పైగా డిజైన్లతో పాటూ తాజాగా వింటర్ కలెక్షన్ కూడా ఈ స్టోర్ లో అందుబాటులో ఉన్నట్లు USPL సిఈఓ, వ్యవస్థాపకురాలు అంజనారెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!