November 21, 2019

జగనన్నా… నా తప్పుంటే పార్టీ నుండి వెళ్లగొట్టండి… ఆమె కాళ్లు మొక్కుతా… కోటంరెడ్డి వ్యాఖ్యలు

Clock Of Nellore ( Nellore ) – ఎమ్పీడిఓ కేసును జిల్లా ఎస్పీ పూర్తిగా తప్పుదోవ పట్టించారని ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వీయ విచారణ జరపాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. ఈ విషయంలో తన తప్పు ఉందని తేలితే పార్టీనుండి శాశ్వతంగా బహిష్కరించాలని స్పష్టం చేశారు. ఎస్పీ తప్పుదోవ పట్టించారా… లేదా మరెవరైనా పట్టించారా అనేది తేల్చాలన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో అర్ధరాత్రి చంద్రబాబు కాళ్లు తాను మొక్కలేదని, జగనన్న కోసం… వైసీపి విజయం కోసం ఇబ్బందుల్లో సైతం ఎదురొడ్డి నిలబడ్డానని విలేకరుల సమావేశంలో అన్నారు. ఉద్యోగ సంఘాల వారు కూడా దీనిపై విచారణ జరపాలని తన తప్పు ఉందని చెబితే ఎమ్పీడిఓ సరళకు బహిరంగంగా క్షమాపణలు చెబుతానని, ఆమె తల్లి పాదాలకు నమస్కారం చేస్తానన్నారు. కొంత మంది పత్రికా, మీడియా ప్రతినిధులు రాస్తున్న రాతల వల్ల ఆత్మహత్య చేసుకునేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజనిజాలను తెలుసుకుని వాస్తవాలను పత్రికల్లో ప్రచురించాలని సూచించారు. తనకు లేని మద్యం అలవాటును ఓ పథకం ప్రకారం తనకు ఆపాదిస్తున్నారని అలాంటి చర్యలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!