November 19, 2019

కోవూరులో దారుణం – భార్యను కిరాతకంగా హత్య చేసిన ఆర్టీసీ డ్రైవర్

Clock Of Nellore ( Kovur ) – నెల్లూరుజిల్లా, కోవూరు మండలంలోని చుండుగుంట గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అదే గ్రామానికి చెందిన గిద్దలూరు విజయ్ నెల్లూరు ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తులసీ అనే యువతితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా ఓ కుమార్తె ప్రమాదవశాత్తూ మరణించింది. పెళ్లి కాక ముందు నుండి ఓ మహిళతో వివాహేత సంబంధం పెట్టుకున్న విజయ్, పెళ్లైన తర్వాత కూడా దాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో పెళ్లైన నెల నుండే భార్య భర్తల నడుమ తరచూ గొడవలు జరిగేవి. వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న భార్య తులసీ అనేక దఫాలు భర్త విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వారికి కౌన్సిల్సింగ్ ఇచ్చి పంపారు. గొడవల కారణంగా పుట్టింట్లోనే ఉంటున్న తులసీ గురువారం సాయంత్రమే చుండుగుంటలోని భర్త నివాసానికి వచ్చింది. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో మంచంపైనే మొద్దుకత్తితో నరికి తులసీని హత్య చేశాడు. అనంతరం అతనే పోలీసులకు సమాచారం ఇచ్చి పరారయ్యాడు. విజయ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కోవూరు పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!