January 23, 2020

అల్పపీడన ప్రభావం… కోస్తాలో మారిన వాతావరణం… రేపటి నుండి వర్షం…

Clock Of Nellore ( Vizag ) –

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడింది. రానున్న 24 గంటల్లో అది వాయు గుండంగా మారనుంది. దీని ప్రభావంతో మంగళవారం నుండి కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు, ఒకటీ రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం లో కేంద్రీకృతమై ఉంది.

తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిమి వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!