November 19, 2019

గూడూరు ఇంటర్ సిటీకి పేరు మార్పు – విక్రమ సింహపురి… అమరావతి ఎక్స్ ప్రెస్ గా నామకరణం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలోని గూడూరు – విజయవాడ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలుకు పేరు మార్పు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. దాని పేరును విక్రమ సింహపురి – అమరావతి ఎక్స్ ప్రెస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. గత నెల 1వ తేదీనా ఈ రైలును గూడూరులో ఉప రాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధాని అమరావతికి ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగొచ్చే విధంగా సమయాన్ని రూపకల్పన చేసి ఈ రైలు ప్రారంభించారు. ప్రారంభోత్సం తర్వాత వివిధ పేర్లను పరిశీలించారు. నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం పేరుతో తల్పగిరి ఎక్స్ ప్రెస్, నరసింహకొండపై వెలసిఉన్న వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి పేరుతో వేదగిరి ఎక్స్ ప్రెస్ మరియు శ్రీహరికోటలోని షార్ రాకెట్ కేంద్రం పేరుతో షార్ ఎక్స్ ప్రెస్ అనే మూడు పేర్లను దక్షిణ మధ్య రైల్వే పరిశీలించింది. మూడు పేర్లను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సూచించగా ఆయన పలు విషయాలను వివరిస్తూ పేరుపై సూచనలు చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరు వచ్చే విధంగా ఉంటే బాగుంటుందని సలహా ఇవ్వడంతో దక్షిణ మధ్య రైల్వే దానికి విక్రమ సింహపురి – అమరావతి ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!