November 22, 2019

మానవత్వం చాటిన గూడూరు సబ్ కలెక్టర్ – గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలింపు

Clock Of Nellore ( Manubolu ) – నెల్లూరుజిల్లాలోని గూడూరు సబ్ కలెక్టర్ గోపాల కృష్ణ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళను స్వయంగా తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. వివరాల్లో కెళ్తే… జిల్లాలోని ఇందుకూరుపేటకు చెందిన ఇసుకల ప్రసన్న తన సోదరుడు చందుతో కలిసి మోటార్ సైకిల్ పై జాతీయ రహదారిపై గూడూరుకు బయలుదేరింది. సరిగ్గా మనుబోలు పోలీస్ స్టేషన్ సమీపంలో మోటార్ సైకిల్ అదుపుతప్పి కుదుపునకు గురైంది. దీంతో ప్రసన్న రోడ్డుపై పడిపోయింది. దీన్ని గమనించని సోదరుడు చందు మామూలుగా బైక్ లో వెళ్లిపోయాడు. అదే సమయంలో నెల్లూరు నుండి గూడూరుకు వెళ్తున్న సబ్ కలెక్టర్ గోపాల కృష్ణ విషయాన్ని గుర్తించి తన సిబ్బంది సహాయంతో ప్రసన్నను తన కారులోనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమెకు బలమైన గాయాలు తగలడంతో మెరుగైన చికిత్స కావాలని చెప్పడంతో అక్కడే ప్రధమ చికిత్స చేయించి నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. తరువాత చందుకు సమాచారం ఇచ్చారు. మానవత్వం చాటిన సబ్ కలెక్టర్ ను పలువురు అభినందించారు. అధికారులంటే ఇలా ఉండాలంటూ కితాబునిచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!