January 23, 2020

చోరీ కేసులో రాజస్థాన్ వాసులను అరెస్ట్ చేసిన గూడూరు పోలీసులు

Clock Of Nellore ( Gudur ) – షాపు షట్టర్ పగులగొట్టి లోపలున్న నగదును చోరీ చేసిన కేసులో ఇద్దరు రాజస్థాన్ వాసులను గూడూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ లోని జులుక్ జిల్లాకు చెందిన ప్రవీణ్ సింగ్, బావార్ లాల్ అనే ఇద్దరు ఉపాధి కోసం నెల్లూరుజిల్లాకు విచ్చేసి చోరీలు చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీ రాత్రి గూడూరులోని ఏఎమ్ఏ బట్టల దుకాణం షట్టర్ ను పగులగొట్టి లోపలున్న 20వేలా250 రూపాయలను దొంగిలించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న 1వ పట్టణ పోలీసులు బుధవారం ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. దీనిపై గూడూరు పట్టణ సిఐ దశరధరామారావు విలేకరుల సమావేశం నిర్వహించి, చోరీ సొత్తులో 8,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరచిన 1వ పట్టణ ఎస్సై బ్రహ్మనాయుడు, సైదులు, సిబ్బంది నాగరాజు, చిరంజీవిలను సిఐ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!