January 23, 2020

బాధితులకు సత్వర న్యాయం అందించండి – “స్పందన” లో పోలీసులకు స్పష్టం చేసిన ఎస్పీ రస్తోగి

Clock Of Nellore ( Nellore ) – స్పందన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. సోమవారం నెల్లూరులోని తన కార్యాలయంలో బాధితుల నుండి వినతుల ను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి అనేక మంది విచ్చేసి పోలీస్ శాఖకు సంబంధించిన సమస్యలను ఎస్పీకి వివరించారు. తక్షణమే న్యాయం చేస్తామని వారికి ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులను చిరునవ్వుతో పలకరించి, వారి సమస్యను సాదరంగా విని సత్వరం వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!