November 19, 2019

సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా – పట్టి వదిలేదిసిన పోలీస్ ?

Clock Of Nellore ( VenkataChalam ) – నెల్లూరుజిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా రాజ్యమేలుతుంది. గత కొంత కాలంగా సాగుతున్న ఈ దందా పై ఉన్నతాధికారులు దృష్ఠి సారించి దాడులు చేసినా రాజకీయ ఒత్తిళ్లతో వారు రాజ్యమేలుతున్నారు. ప్రధానంగా సర్వేపల్లి, తిక్కవరప్పాడు, అనికేపల్లి, కండేపాడు ప్రాంతాల నుండి నిత్యం గ్రావెల్ తరలిపోతుంది. రాష్ట్రంలో వైసీపి ప్రభుత్వం వచ్చిన నాటిన నుండి అక్రమాలకు చెక్ పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. అయినప్పటికీ గ్రావెల్ అక్రమ రవాణా ఆగలేదు. తాజాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ రాత్రి గ్రావెల్ తో అక్రమంగా తరలిపోతున్న మొత్తం 7 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే రాజకీయ ఒత్తిళ్ల నేపద్యంలో ఆ వాహనాలను వదిలేసినట్లు తెలినట్లు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు అందినా భేఖాతరు చేసినట్లు సమాచారం. ఆ నాయకుడు కూడా అధికార పార్టీకి చెందిన వ్యక్తిగా ప్రచారం జరుగుతోంది. తన ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు జరగకూడదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. అక్రమంగా గ్రావెల్ ను తరలిస్తూ పట్టుబడిన వాహనాలను ఎలా విడుదల చేస్తారని కూడా చర్చ జరుగుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!