November 19, 2019

ముగిసిన వెంకటగిరి పోలేరమ్మ జాతర – ఘనంగా జరిగిన శోభా యాత్ర

Clock Of Nellore ( Venkata giri ) – నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే వెంకటగిరి పోలేరమ్మ జాతర గురువారం రాత్రి ఘనంగా ముగిసింది. బుధవారం అర్ధరాత్రి అమ్మవారి ప్రతిమను దేవస్థానానికి తీసుకొచ్చిన నిర్వాహకులు అక్కడే అమ్మవారిని ప్రతిష్టించారు. గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల సందర్శనార్థం ఉంచారు. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. ఇక స్థానిక శాసనసభ్యులు ఆనం రామ నారాయణ రెడ్డి మరియు తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ వెంకటగిరికి విచ్చేసి పోలేరమ్మ ను దర్శించుకున్నారు. వీరే కాకుండా నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు వెంకటగిరికి విచ్చేసి జాతరలో పాల్గొన్నారు. మరోవైపు నెల్లూరుకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి మరియు టీటీడీ బోర్డు మెంబర్ ప్రశాంతి రెడ్డి తదితరులు పోలేరమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం తర్వాత పోలేరమ్మ శోభాయాత్ర ప్రారంభమైంది. వెంకటగిరి పట్టణ వీధుల్లో అమ్మవారి శోభాయాత్ర లక్షలాదిమంది భక్తజనుల మధ్య ఘనంగా జరిగింది. సాయంత్రం తర్వాత రాత్రి అమ్మవారి విగ్రహ నిమజ్జనం జరిగింది. దీంతో జాతర ముగిసినట్లైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!