January 23, 2020

ఎన్.డి.సి.సి బ్యాంకు ఛైర్మైన్ గా ఆనం విజయకుమార్ రెడ్డి – మార్కెట్ శాఖకు వీరి చలపతి – ఉత్తర్వులు జారీ

Clock Of Nellore ( Amaravathi ) – నెల్లూరుజిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మైన్ గా వైసీపి రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి నియమితులైనారు. ఆయనతో పాటూ సభ్యులుగా 5 మందికి అవకాశం కల్పించారు. అలాగే జిల్లా మార్కెటింగ్ కమిటి ఛైర్మైన్ గా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచరులు వీరి చలపతి రావును నియమించారు. అక్కడ సభ్యులుగా 6 మందికి ఆవకాశం కల్పించారు. ఈ ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. సహకార బ్యాంకు చైర్మైన్ గా ఆనం విజయకుమార్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం సభ్యులుగా వైసీపి నేతలు, రైతులు అయిన చెన్ను బాలకృష్ణారెడ్డి, మద్దాలి సోమశేఖర్ రెడ్డి, మేరిగ మధుసూదన్, చింతం తిరుమల రాణి, డక్కిలి రమణయ్య, సయ్యద్ గౌస్ మొహిద్ధీన్ లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ కమిటి ఛైర్మైన్ గా వీరి చలపతి రావును నియమించగా సభ్యులుగా దాసరి భాస్కర్ గౌడ్, మన్నవరపు రవికుమార్, పందిళ్లపల్లి రాజేశ్వరమ్మ, గునుపాటి సురేష్ రెడ్డి, చేజర్ల చల్లమా రెడ్డి, షేక్ కంతర్ అలీలను నియమించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!