November 12, 2019

గూడూరు సబ్ కలెక్టర్ గా గోపాల కృష్ణ – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Clock Of Nellore ( Gudur ) – నెల్లూరుజిల్లాలోని గూడూరుకు సబ్ కలెక్టర్ గా రోనంకి గోపాల కృష్ణను నియమిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ పూర్తి చేసుకున్న మొత్తం 6 మంది ఐఏఎస్ లకు పోస్టింగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా గూడూరు సబ్ కలెక్టర్ గా గోపాల కృష్ణను నియమించింది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన గోపాల కృష్ణ వృత్తి రీత్యా టీచర్. ఐఏఎస్ కావాలన్న సంకల్పంతో టీచర్ వృత్తిలోనే ఉంటూ సివిల్స్ పరీక్షలు రాశారు. 2017లో ఆలిండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కు ఎంపికయ్యారు. వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేసుకున్న గోపాలకృష్ణకు మొదటి పోస్టింగ్ గూడూరు సబ్ కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!