November 21, 2019

బంగారుతో ఉడాయించే కిలాడీ లేడీని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – బంగారు దుకాణంకు తరచూ వస్తూ పోతూ మంచిగా వ్యవహరించినట్లు నటించి బంగారు నగలను దోచుకెళ్లిన కిలాడీ లేడీని నెల్లూరులోని సంతపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నెల్లూరులోని మనుమసిద్ధి నగర్ కు చెందిన చేబ్రోలు భార్గవి అనే మహిళ కాపువీధిలోని శంకర్ లాల్ నిరపతి రాజ్ అనే బంగారు దుకాణంకు తరచూ వెళ్లి వస్తుండేది. అదే సమయంలో ఈనెల 25వ తేదీనా దుకాణ యజమాని లలిత్ కుమార్ కన్నుగప్పి బంగారు పూల హారంతో పాటూ జత కమ్మలను దొంగిలించి ఏమీ తెలియనట్లు అక్కడి నుండి వెళ్లిపోయింది. దీనిపై లలిత్ కుమార్ సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుకాణంలోని సిసి కెమరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు బంగారు చోరీ చేసింది భార్గవిగా గుర్తించారు. శనివారం ఆమెను అరెస్ట్ చేసి ఒక లక్షా 85వేలు విలువ కలిగిన పూలహారంతో పాటూ కమ్మలను రికవరీ చేశారు. దీనిపై సంతపేట పోలీస్ స్టేషన్ లో నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో సిఐ రాములు నాయక్, ఎస్సై వీరనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!