January 23, 2020

స్పోర్ట్స్ బైక్ పై వెళ్తూ ప్రమాదం – ఒకరి పరిస్థితి విషమం – ఇద్దరికి గాయాలు

Clock Of Nellore ( Gudur ) – మెరుపు వేగంతో స్పోర్ట్స్ బైక్ పై వెళ్తూ ప్రమాదానికి గురైనారు ముగ్గురు యువకులు. వివరాల్లో కెళ్తే… నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలం పరిధిలోని వరగలి సమీపంలో ఉన్న కోల్డ్ స్టోరేజీ ఎదురుగా బుధవారం సాయంత్రం జాతీయ రహదారిపై స్పోర్ట్స్ బైక్ పై ముగ్గురు యువకులు వేగంగా వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ వారి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హర్ష అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెనుక కూర్చొని ఉన్న మరో ఇద్దరూ గాయపడ్డారు. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. హర్ష పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!