November 19, 2019

నాయుడుపేటలో గంజాయి ముఠా – మహిళ అరెస్ట్ – నలుగురు పరారీ – 95 కిలోల స్వాధీనం

Clock Of Nellore ( Naidupeta ) – నెల్లూరుజిల్లాలోని నాయుడుపేటలో గంజాయి ముఠా గుట్టు రట్టయింది. మొత్తం నలుగురు సభ్యులతో కూడిన ఈ ముఠా ఇతర ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో గంజాయిని తీసుకొచ్చి దాన్ని వివిధ ప్రాంతాలకు పంపుతుంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న నాయుడుపేట పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వ హించి 10 లక్షల రూపాయల విలువైన 95 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఉన్న ముఠాలోని మేల్పడి రాధ అనే మహిళను అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. వారిని అరెస్ట్ చేయాల్సి ఉంది. చిత్తూరుజిల్లా పుంగనూరు మండలం, భీమగానిపల్లి గ్రామానికి చెందిన మేల్పడి రాధ, ఆమె భర్త రమేష్, బంధువు అయిన లక్ష్మీదేవి ఆమె భర్త రాజేంద్ర అనే నలుగురు నాయుడుపేటలో ఉంటూ ఈ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గంజాయి స్మగ్లర్లలో పరిచయాలు పెంచుకుని తుని ప్రాంతం నుండి నాయుడుపేటకు తీసుకొస్తారు. అక్కడి నుండి మరో స్మగ్లర్ మారెప్ప అనే వ్యక్తి చెప్పిన దగ్గరకు ఆ గంజాయిని చేర్చాలి. దీని గానూ వీరికి పెద్ద ఎత్తున నగదు ఇస్తారు. అదే క్రమంలో గురువారం సాయంత్రం తుని నుండి గుర్తు తెలియని లారీలో గంజాయి లోడు నాయుడుపేటకు చేరుకుంది. ఆ గంజాయి లోడును అన్ లోడ్ చేస్తుండగా పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి రాధను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురు పరారయ్యారు. నాయుడుపేట సిఐ వేణుగోపాల్ రెడ్డి 95 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై శుక్రవారం ఉదయం నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో గూడూరు డిఎస్పీ భవాని శ్రీహర్ష విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో తప్పించుకున్న మరో నలుగుర్ని అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!