January 23, 2020

కర్నూలు ఇంఛార్జ్ మంత్రిగా అనీల్ – నెల్లూరుకు బాలినేని వాసు

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను మార్పు చేస్తూ ప్రభుత్వం ఆదివారం రాత్రి జీఓను విడుదల చేసింది. నెల్లూరుజిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస రెడ్డి ( వాసు )ని నియమించారు. ఇప్పటి వరకూ నెల్లూరుకు ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న మేకతోటి సుచరితకు ఎక్కడా బాధ్యతలు ఇవ్వలేదు. ఇక నెల్లూరుకు చెందిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను కర్నూలు జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా నియమించారు. శ్రీకాకుళంకు కొడాలి నాని, విజయనగరంకు వెల్లంపల్లి శ్రీనివాసరావు, విశాఖపట్నంకు కురసల కన్నబాబు, ఈస్ట్ గోదావరికి మోపిదేవి వెంకటరమణ, వెస్ట్ గోదావరికి పేర్ని నాని, కృష్ణా జిల్లాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుంటూరుకు రంగనాథరాజు, ప్రకాశం జిల్లాకు బుగ్గన రాజేంద్రనాథ్, కడపకు ఆదిమూలపు సురేష్, అనంతపురంకు బొత్స సత్యనారాయణ, చిత్తూరుకు మేకపాటి గౌతమ్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం జీఓ నంబర్ 9ని విడుదల చేసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!