January 23, 2020

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య – ఉత్తర్వులు జారీ చేసిన నెల్లూరు విద్యాశాఖాధికారి

Clock Of Nellore ( Nellore ) – 2019-2020 విద్యా సంవత్సరానికి గానూ నెల్లూరుజిల్లాలోని అన్నీ ప్రైవేటు, ఎయిడెట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను కల్పిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అవకాశాన్ని కల్పిస్తూ ఆయా జిల్లా అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. తాజాగా జర్నలిస్టు సంఘాల అభ్యర్ధన మేరకు జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో జిల్లా కలెక్టర్ గా పనిచేసి వెళ్లిన ఎమ్. జానకి కూడా అప్పట్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ అవకాశం కల్పించారు. తాజాగా కలెక్టర్ శేషగిరి బాబు 100 శాతం ఫీజు రాయితీ కల్పించారు. దీనిపై జిల్లాలోని జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. అయితే విద్యాశాఖ అధికారుల ఉత్తర్వులు ఏ మేర అమలవుతాయే చూడాల్సి ఉంది. కొన్ని విద్యాసంస్థలు తామెందుకు ఉచిత విద్య ఇవ్వాలంటూ ఇప్పటికే ప్రశ్నలు సంధిస్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!