November 22, 2019

వైసీపిలోకి చాట్ల – ఈనెల 14న ముహుర్తం – ఫలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి మంత్రాంగం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు టిడిపి నేత, జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధి కమిటి మాజీ ఛైర్మైన్ చాట్ల నరసింహారావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆయన వైసీపిలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా చాట్ల నరసింహారావు నివాసానికి వెళ్లి వైసీపిలోకి రావాలని ఆహ్వానించగా ఆయన అంగీకరించారు. అక్కడికక్కడే ముహుర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఈనెల 14వ తేదీనా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో చాట్ల నరసింహారావు వైసీపి తీర్ధం పుచ్చుకోనున్నారు. నెల్లూరులో ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించిన చాట్ల నరసింహారావు ఓ ప్రైవేటు స్కూలును స్థాపించారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి తండ్రి ఆనం వెంకటరెడ్డి పిలుపుతో రాజకీయాల్లోకి ప్రవేశించిన నరసింహారావు నాలుగు దఫాలు కౌన్సిలర్ గా, ఓ దఫా కార్పొరేటర్ గా మరో దఫా కార్పొరేషన్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా కొనసాగారు. ఆనం వెంకటరెడ్డి తర్వాత ఆనం వివేకానందరెడ్డికి ముఖ్య సలహాదారునిగా ఉంటూ సిటీ కాంగ్రెస్ అధ్యక్షునిగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గా పనిచేశారు. సౌమ్యునిగా, వివాద రహితునిగా అందరితో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తిగా పేరు గడించిన చాట్ల నరసింహారావు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిల పడటంతో ఆపార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి మంత్రి పొంగూరు నారాయణ అనుచరునిగా ఉంటూ నెల్లూరులోని జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ది కమిటి ఛైర్మైన్ గా నియమితులైనారు. మూడేళ్లపాటూ అభివృద్ది కమిటి ఛైర్మైన్ గా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయాన్ని చవిచూడటంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే క్రమంలో ఆయనకు వ్యక్తిగతంగా సంబంధాలు కలిగిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆహ్వానం మేరకు వైసీపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తో కూడా నరసింహారావుకు మంచి సంభందాలు ఉన్నారు. ఈనెల 14వ తేదీనా వారిద్దరి సమక్షంలో వైసీపిలో చేరనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!